ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అపార్ ఐడీ జనరేషన్‌ను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా సమగ్ర శిక్షణ టీం ఏపీఓ గోపాల్ రెడ్డి అన్నారు. గురువారం కేవీబీపురం ఎంఆర్సీలో జరుగుతున్న అపార్ ఐడీ జనరేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎటువంటి తప్పులు లేకుండా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులు భవిష్యత్తులో ప్రభుత్వం ద్వారా అన్ని సదుపాయాలు పొందేందుకు అపార్ ఉపయోగపడుతుందన్నారు.