తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం పులిగుండ్రం గ్రామంలో గురువారం రెవెన్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులకు స్థానిక ప్రజలు అర్జీలు సమర్పించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్య కర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.