భారతీయ అంబేడ్కర్ సేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలానికి చెందిన సీతాపతిని నియమిస్తూ సంఘం జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు ఆదివారం ఓ ప్రకటన జారీ చేశారు. సంఘం వ్యవస్థాపకులు శివప్రసాద్, రాష్ట్ర కన్వీనర్ గణపతి సూచనల మేరకు ఆయనను నియమిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. బహుజన వర్గాల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాడతామని సీతాపతి తెలిపారు.