సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండిస్తూ వివిధ దళిత సంఘాల నాయకులు, బీఎస్పీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ధన ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. దళితులను రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కడానికే టీడీపీ ఇతర పార్టీల నాయకులు కొందరు వరలక్ష్మితో కలిసి కుట్రపన్నారన్నారు. ఈ కేసులో వెనుక ఉన్న కుట్ర దారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.