సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి సమస్యను పరిష్కరించాలని సురుటుపల్లి గ్రామస్థులు తెలిపారు. శనివారం ఎంపీ గురుమూర్తిని కలిసి వినతి పత్రం అందజేశారు. స్మశానానికి వెళ్లే దారిలో ఏటి కాలువ ఉన్నందువల్ల సమస్యగా మారిందని చెప్పారు. వెంటనే స్పందించి కాలువకు అడ్డంగా కల్వర్టు నిర్మించాలని కోరారు. స్పందించిన ఎంపీ త్వరలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.