శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు
సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్, నాయుడుపేట సమీపంలోని సెజ్‌లో ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిలిప్స్ కార్బన్ రూ. 3,718 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీంతో 200 మందికి డైరెక్ట్ గా ఉపాధి లభించనుంది. శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రూ. 5,001 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా, 1,495 మందికి ఉద్యోగాలు రానున్నాయి.