ఎన్నికల హామీలు, సూపర్ సిక్స్ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారంటూ కూటమి నేతలను నిలదీయాలని సీపీఎం నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాపోరులో భాగంగా సీపీఎం నేతలు శనివారం శ్రీకాళహస్తి నియోజకవర్గం వ్యాప్తంగా కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్డీకే నగర్ లో ప్రాంతీయ కార్యదర్శి గంధం మణి, వెంకటేష్ లు పర్యటించి ప్రజాపోరు కరపత్రాలను ప్రజలకు అందజేశారు.