శ్రీకాళహస్తిలో నలుగురు తొలగింపు.. ఒకరి సస్పెండ్
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సెల్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు సిబ్బందిని తొలగిస్తూ, ఒకరిని సస్పెండ్ చేస్తూ ఈవో బాపిరెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి సెల్ ఫోన్ ను ఆలయంలో నిషేధిస్తూ ఈవో బాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం దేవస్థానంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధించినట్లు ఆయన తెలిపారు.