రోడ్డు నిర్మాణానికి రూ. 55 లక్షలతో ప్రతిపాదనలు

83చూసినవారు
రోడ్డు నిర్మాణానికి రూ. 55 లక్షలతో ప్రతిపాదనలు
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో గుంతలమయంగా మారి ప్రమాదకరంగా ఉన్న పాత ట్రెజరీ వీధి ప్రధాన రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. పాత వెంకటగిరి రోడ్డు నుంచి విశ్వభారతి పాఠశాల వరకు రూ. 55 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సమక్షంలో బుధవారం తీర్మానం చేశారు. మున్సిపల్ ప్రత్యేక నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టునున్నారు.

సంబంధిత పోస్ట్