దొరవారిసత్రం మండలం సింగనాలత్తూరు దళితవాడలో ఎర్రబోతు కల్యాణ్ తన భార్య కోటమ్మను సోమవారం చితకబాదాడు. అడ్డు వచ్చిన అత్త మస్తానమ్మను కొట్టి గాయపరిచాడు. సమాచారం తెలుసుకొన్న కోటమ్మ సోదరులు కారికాడు గ్రామానికి చెందిన నవీన్, హరిబాబు సింగనాలత్తూరు గ్రామానికి చేరుకుని కల్యాణ్ ను నిలదీశారు. మద్యం మత్తులో ఉన్నం కల్యాణ్ నవీన్, హరిబాబుపై మచ్చు కత్తితో దాడికి తెగబడ్డాడు.