సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మున్సిపాలిటి పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 8 నెలలుగా జీతాలు అందలేదని వారు శనివారం వాపోయారు. పారిశుద్ధ్యం విభాగంలో సుమారు 150 మందికి పైగా పనిచేస్తున్నారు. వారిలో కొత్త వారికి 8నెలలుగా, పాత వారికి 4నెలలుగా జీతాలు రావడం లేదు. ఎండకు ఎండుతూ. వానకు తడుస్తూ రక్షణ పరికరాలు లేకపోయినా పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంతో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు.