పెద్దతిప్పసముద్రం: 63 లక్షల నిధులతో పనులు ప్రారంభం

75చూసినవారు
పెద్దతిప్పసముద్రం: 63 లక్షల నిధులతో పనులు ప్రారంభం
పెద్దతిప్పసముద్రం మండలంలో పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా మల్లెల, తుమ్మర కుంట పంచాయతీలలో మంగళవారం సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువల పనులను ప్రారంభించారు. రెండు పంచాయతీలలో 63 లక్షల నిధులతో పనులు ప్రారంభించినట్లు ఇంచార్జ్ ఎంపీడీవో యోగానంద తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లెల సర్పంచ్ శ్రీకంఠ రెడ్డి, మండల ప్రత్యేకాధికారి మునిరాజ కుమార్, ఉపాధి హామీ పథకం ఏపీడీ మధు బాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్