నాయుడుపేట మండలం పూడేరు సమీపంలో అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలించేందుకు సిద్దంగా ఉన్న టిప్పర్ లారీ, హిటాచి వాహనాన్ని పలువురు స్థానికులు అడ్డుకుని ఆదివారం రాత్రి పోలీసులకు సమాచారం అందించారు. వాహనాల పారిపోకుండా ఉండేందుకు చక్రాలకు గాలి తీశారు. విషయం తెలుసుకున్న నాయుడుపేట పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. గనుల భూగర్భ శాఖ అధికారులకు అప్పగించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.