స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన స్పందనకు 132 వినతులు, ఎస్పీ స్పందనకు 30 ఫిర్యాదులు వచ్చాయి.