భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ, వై. చంద్రచూడ్ ఈనెల సెప్టెంబర్ 28, 29తేదీలలో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారని తిరుపతి కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 28న శనివారం సాయంత్రం తిరుపతిలో రాత్రి బస చేసి 29న ఆదివారం తిరుమల చేరుకొని, శ్రీవారిని దర్శించుకొని తిరుపతి విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణం కానున్నారని కలెక్టర్ తెలిపారు.