తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీటీడీ ఆహ్వానించింది. ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన టీటీడీ ఈవో జె. శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. అర్చకులు, వేదపండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందించారు.