తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం జగన్ 28వ తేదీన తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేయనున్న నేపథ్యంలో జగన్ పర్యటన తిరుమలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అలిపిరిలోనే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గురువారం తిరుపతిలో డిమాండ్ చేశారు. లేదంటే కొండ కిందనే ఆయనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.