తిరుపతి: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

51చూసినవారు
తిరుపతి: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన రేణిగుంట-తిరుపతి రహదారి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏరియాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం. ఒడిశాకు చెందిన అమర్(26) ఎస్టేట్ లోని ఓ కర్మాగారంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజువారి పనిలో భాగంగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్ తో అమర్ పడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్