రెండు రోజుల పర్యటన నిమిత్తం సినీ హీరో మంచు మనోజ్ బుధవారం హైదరాబాదు నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. తమ అభిమాన హీరోకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన మోహన్ బాబు యూనివర్సిటీకి బయలుదేరి వెళ్లారు. మంచు మనోజ్ 12వ తేదీనే రావాల్సి ఉండగా ఇప్పుడు తన పర్యటన కొనసాగించడంతో ఏం జరుగుతుందో అని ఆసక్తి నెలకొంది. జల్లుకట్టులో పాల్గొంటారని సమాచారం.