2017 అక్టోబర్ 24న జరిగిన హత్య కేసులో ఓ మహిళకు జీవిత ఖైదు విధిస్తూ చిత్తూరు 8వ అడిషనల్ జిల్లా కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. పాలసముద్రం(మం) నరసింహపురానికి చెందిన గోవిందమ్మను భర్త మునివేలు అనుమానంతో రోజు వేధిస్తుండేవాడు. దీంతో మద్యం తాగి నిద్రిస్తున్న భర్తపై పెట్రోలు పోసి నిప్పంటించడంతో మృతి చెందాడు. కేసు నిర్ధారణ కావడంతో మహిళకు జీవిత ఖైదుతో పాటు వెయ్యి రూపాయల జరిమానాను విధించారు.