తమిళనాడు గవర్నర్ ఆర్ రవి కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా తమిళనాడు గవర్నర్ ను శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికే దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆయనకు ఆలయ రంగనాయకులు మండపంలో ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.