పులివర‌్తి నాని చూపిన ఆప్యాయత మరువలేనిది

75చూసినవారు
న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమంలో శ్రీవారి దర్శనానికి వచ్చిన తమను ఆదరించిన ఎమ్మెల్యే పులివర్తి నాని ఆ రోజు చూపిన ఆప్యాయత మరువ లేనిదని అమరావతి రాజధాని ప్రాంత రైతులు అన్నారు. శుక్రవారం శ్రీవారి దర్శనానంతరం తిరుచానూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో వున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని కలసి భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్