వైద్యురాలి హత్యాచార ఘటన.. అనుమానాలు రేకెత్తిస్తున్న తలుపు గొళ్ళెం

530చూసినవారు
వైద్యురాలి హత్యాచార ఘటన.. అనుమానాలు రేకెత్తిస్తున్న తలుపు గొళ్ళెం
కోల్‌కతా వైద్య విద్యార్థిని కేసులో విచారణ చేస్తోన్న సీబీఐ పలు కీలక విషయాలను వెల్లడించింది. సెమినార్‌ హాల్‌ డోర్‌ బోల్ట్‌ పని చేయడం లేదని విచారణలో పేర్కొంది. ఆమెను చిత్రహింసలు పెట్టే వేళలో హాల్‌ లోపల నుంచి వచ్చే శబ్దాలు ఎవ్వరికీ వినిపించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘సెమినార్‌ హాల్‌ డోర్‌ బోల్ట్‌ విరిగిపోయింది. సెమినార్‌ హాల్‌ లోపలికి ఎవరూ రాకుండా ఉండేందుకు బయట నిల్చొని ఎవరైనా సహకరించారా’ అనే కోణంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్