తిరుపతి: మత్స్యకారుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

53చూసినవారు
మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లాలో ఆక్వారంగాన్ని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని, ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మత్స్యశాఖ వారు నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవం కార్యక్రమంలో ఆక్వా సాగు రైతులు, హ్యాచరీ ప్రతినిధులు హాజరవగా ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్