తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు, సేవలు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టీటీడీ తీసుకున్న చర్యల వలన అందుతున్నాయని, ప్రభుత్వానికి ఆ దేవ దేవుని అండ దండలు ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాను అని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శనివారం తిరుమల శ్రీవారిని మంత్రి పార్థసారథి దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రికి రంగనాయక మండపం నందు వేద పండితులు ఆశీర్వచనం పలికారు.