సినీ నటుడు సాయిధరమ్ తేజ్ బుధవారం వేకువ జామున సుప్రభాత సేవలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల అభిమానులు భక్తులు సాయి ధరమ్ తేజతో ఫోటోలు దిగారు.