టీమ్ ఇండియా యంగ్ క్రికెటర్ నితీశ్ రెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సోమవారం నడక మార్గంలో తిరుమల చేరుకున్న ఆయన మంగళవారం స్వామివారి దర్శనం చేసుకున్నారు. ప్రతి ఏడాది తిరుమల వస్తాను. చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన విరాట్ కోహ్లి ముందు సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫి జట్టులో చోటు లభిస్తే తప్పకుండా మంచి ప్రదర్శన చేస్తాను' అని చెప్పారు.