పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని సోమవారం భోగిమంటల్లో విద్యుత్ బిల్లులను దహనం చేశారు. సోమవారం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ఎదురుగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సీఐటీయు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా అంతట కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని నిరసనలు చేశారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకుడు కందారపు మురళి పాల్గొన్నారు.