తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన కూరగాయల మార్కెట్‌లో పని చేసే అజంతుల్లాపై రుద్ర, అతని కుమారులు కత్తితో దాడి చేశారు. తన యజమాని మహబూబ్ బాషాపై దాడి చేసేందుకు యత్నించగా అజంతుల్లా అడ్డుకోవడంతో.. ఆగ్రహించిన రుద్ర, అతని కుమారులు అజంతుల్లాను విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. కాగా, ఈ ఘటన డిసెంబర్ 31న జరగగా.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. కాగా దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.