తిరుపతిలోని ఎస్డిహెచ్ఆర్ కళాశాలలో 2020-21లో డిగ్రీలో చేరానని, ఆరోగ్య సమస్యలతో కళాశాలకు వెళ్లలేదని, కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు దరఖాస్తు చేసుకున్నానని, కళాశాల వారు పూర్తి ఫీజు చెల్లించాలని, లేనిపక్షంలో సర్టిఫికెట్లు ఇవ్వనన్నారని కలెక్టర్ వెంకటేశ్వర్ కు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విద్యార్థిని అమరావతి వినతి ఇచ్చారు. దీనిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఎస్వీయూ రిజిస్టర్ కు రెఫర్ చేశారు.