ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం ద్వారా సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి భగవద్గీతకు ఉందని డిపిపి కార్యదర్శి రఘునాథ్ అన్నారు. హిందూధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత శ్లోకాల కంఠస్తం పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బుధవారం బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సమాజంలో ఆధ్యాత్మిక కోణంలో ఎలా జీవించాలో భగవద్గీత తెలియజేస్తుందన్నారు.