భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో కూడుకున్న స్వామి వారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు వేసిన సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని చెప్పారు.