గుర్తుతెలియని వాహనం ఢీకొని కార్మికుడి మృతి

6493చూసినవారు
గుర్తుతెలియని వాహనం ఢీకొని కార్మికుడి మృతి
బాలాయపల్లి మండలంలోని పెరిమిడి సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని కార్మికుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు తొట్టంబేడు మండలం చిన్న కనపర్తి గ్రామానికి చెందిన పులి మస్తాన్ (38) మేనకూరులోని వెస్టేజ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సొంత పని నిమిత్తం బాలాయపల్లి మండలంలోని ఊట్లపల్లి గ్రామానికి వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని తలపై తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్