ఏపీ ప్రభుత్వం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రజలకు తీపి కబురు చెప్పింది. డిసెంబర్ 25న పండుగ నేపథ్యంలో క్రిస్టియన్స్ అందరికీ క్రిస్మస్ కానుక అందిస్తామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. అలాగే ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ తిరిగి ప్రవేశపెడతామని తెలిపారు.