AP: వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడికి హైకోర్టులో ఊరట లభించింది. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, సెజ్ వ్యవహారంలో విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరైంది. కేవీఆర్ గ్రూపుకు చెందిన వాటాలు అరబిందోకు బదలాయించిన వ్యవహారంలో CID పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ-1గా ఉన్న విక్రాంత్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.