AP: అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మంత్రి నిమ్మల రామానాయుడు అనారోగ్యంతోనే అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్ ఆయనతో సరదాగా మాట్లాడారు. ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి పని చేస్తానంటే సస్పెండ్ చేయిస్తానని చమత్కరించారు. విశ్రాంతి తీసుకుంటారా?.. సభ నుంచి సస్పెండ్ చేయించాలా అని వ్యాఖ్యానించారు. దానికి.. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఆరోగ్యం బాగానే ఉందని నిమ్మల బదులిచ్చారు.