AP: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్‌పై అధికారులతో చర్చించారు. బియ్యం స్మగ్లింగ్ వంటి అక్రమ చర్యలను నియంత్రించేందుకు అవసరమైతే పీడీ యాక్టును వాడాలని ఆదేశించారు. ఈ బాధ్యత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపైనే ఉందని పేర్కొన్నారు. ఒక పోర్ట్ కాకపోతే ఇంకో పోర్ట్‌కు అక్రమార్కులు వెళ్తున్నారని.. స్ట్రాంగ్ మాఫియా తయారైందన్నారు.