ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష

59చూసినవారు
ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష
బుడమేరలో వరద బాధితులకు అందుతున్న సాయాన్ని పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులతో కలెక్టరేట్‌లో మరోసారి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బోట్లలో వెళ్లడానికి అవకాశం లేని పరిసరాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలని అధికారులకు ఆదేశించారు. మూడు పూటలా బాధితులకు ఆహారం అందించాలన్నారు. హార్ట్ పేషంట్లు, చిన్నారులు, గర్భిణులను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. లంక గ్రామాల సమస్యలపై స్థానిక అధికారులను అప్రమత్తం చేయమని కలెక్టర్లకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్