ధాన్యం కొనుగోళ్లపై సీఎం చంద్రబాబునాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 26 జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లై శాఖ అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి విధి విధానాలపై కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. సమీక్షలో సీఎస్ నీరబ్‌కుమార్, మంత్రులు నాదెండ్ల, అచ్చెన్నాయుడు కూడా పాల్గొన్నారు.