ఏపీ వ్యాప్తంగా ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. క్యాంప్ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, బాలశౌరి, ఆక్వా రైతులు పాల్గొన్నారు. అమెరికా ప్రభుత్వం విధించిన టారిఫ్‌ల వల్ల ఆక్వా రంగానికి తీరని నష్టం కలిగిన విషయం తెలిసిందే. సమస్య పరిష్కారానికి ఆక్వా రైతులు, ప్రజాప్రతినిధులు, ట్రేడర్లు అధికారులతో కమిటీని సీఎం నియమించారు.