ఏపీ ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభినందించారు. పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేసి అరకు కాఫీని ప్రోత్సహించినందుకు నారాయణ ఏపీ, కేంద్ర ప్రభుత్వాలను అభినందనలు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో చిరుధాన్యాలు, పిప్పళ్ళు, మిరియాలు, ఔషధ వనమూలికల పెంపకానికి ప్రోత్సాహం కల్పించాలని.. పర్యాటక రహదారులతోపాటు మారుమూల తాండాలకు రోడ్ల నిర్మాణం, వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని ఆయన సూచించారు.