తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు కూడా మరణించాడు. ఈ ఘటన కోల్‌కతాలోని కాన్పూర్‌లో జరిగింది. లయిక్ అహ్మద్ ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. తండ్రి మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తుండగా కుమారుడు అతిక్ బైక్‌పై వెంట వెళ్లాడు. ఈ క్రమంలో తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన అతను గుండెపోటుకు గురై చనిపోయాడు. దీంతో ఇద్దరి మృతదేహాలను ఒకేచోట ఖననం చేశారు.