AP: అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే సివిల్ సప్లైస్ శాఖ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. డిప్యూటీ CM పవన్ కాకినాడ పర్యటనతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. DGPతో కలిసి రేషన్ మాఫియాపై చర్యలు తీసుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. వేల టన్నుల రేషన్ బియ్యం తరలింపులో దోషులను ఆధారాలతో పట్టుకునేందుకు ప్రణాళికలు చేస్తోంది.