AP: మందుబాబులకు శుభవార్త. త్వరలోనే రాష్ట్రంలో ప్రీమియం స్టోర్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ఏర్పాటుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులివ్వగా, 12 స్టోర్లు ఏర్పాటు కానున్నాయి. దరఖాస్తు ఫీజు రూ.15 లక్షలు కాగా, లైసెన్స్ ఫీజు కింద ఏడాదికి రూ.కోటి చెల్లించాలి. ఈ స్టోర్లకు ఒకేసారి ఐదేళ్లకు లైసెన్స్ ఇస్తారు. కనీసం 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం చూపించిన వారే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.