‘దానా’ తుపాను ఎఫెక్ట్.. రాష్ట్రాలకు NDRF బృందాలు

53చూసినవారు
‘దానా’ తుపాను ఎఫెక్ట్.. రాష్ట్రాలకు NDRF బృందాలు
‘దానా’ తుపాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF) డిఐజి మొహసేన్ షాహెదీ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలకు 46 NDRF బృందాలను పంపినట్లు చెప్పారు. ఒడిశాకు 20, బెంగాల్‌కు 13, ఏపీలోని విశాఖకు 9 NDRF బృందాలను పంపామన్నారు. 4 బృందాలు రిజర్వ్‌లో ఉంచామని తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తుపాను తీరం దాటే అవకాశముందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్