షార్ట్ సర్క్యూట్‌తో డీసీఎం దగ్ధం (వీడియో)

62చూసినవారు
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కొత్తూరు గ్రామ సమీపంలో నిన్న రాత్రి షార్ట్ సర్క్యూట్ అయ్యి డీసీఎం దగ్ధమైంది. బళ్ళారి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై డీసీఎం నుంచి దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వాహనదారుడు వాపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్