AP: బాపట్ల జిల్లా కొత్తపాలెం పంచాయతీ పెద్దూరుకు చెందిన అరుణతో గోకర్ణమఠం గ్రామానికి చెందిన అమరేంద్రబాబు (38)కు వివాహమైంది. తరచూ భర్త వేధించేవాడు. గురువారం మద్యం మత్తులో జేబులో చాకు పెట్టుకుని భార్య వద్దకు వచ్చి గొడవ పడ్డాడు. తనను చంపేస్తాడన్న భయంలో అరుణ కర్రతో కొట్టింది. మెడకు తాడు కట్టి ఈడ్చుకెళ్లింది. దాంతో అతను చనిపోయాడు. మరోవైపు.. కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన భర్తను భార్య చంపి ముక్కలుగా చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని ఉమరాణి గ్రామంలో జరిగింది.