ఆధార్ వెరిఫికేషన్ విషయంలో కేంద్రం పెద్ద మార్పు చేసింది. ప్రైవేట్ కంపెనీలు మొబైల్ యాప్‌లకు ఆధార్ ఆధారిత ముఖ ప్రామాణీకరణను జోడించడానికి ప్రభుత్వం అనుమతించింది. దీనికోసం swik.meity.gov.in అనే పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ మార్పుతో పౌరులకు హెల్త్, ఈ-కామర్స్, ఎడ్యుకేషన్, క్రెడిట్ రేటింగ్ సేవలు మరింత సులభతరమవుతాయి. అలాగే కార్డుహోల్డర్లు తమ బయోమెట్రిక్ వివరాలను లాక్, అన్‌లాక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.