AP: 'రెడ్ బుక్'పై మంత్రి నారా లోకేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 'రెడ్ బుక్' తనపని తాను చేసుకుంటూ వెళ్తుందని లోకేష్ వెల్లడించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునే ప్రక్రియ మొదలై పోయిందని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎవరినో వదిలేస్తాము అనే ఆలోచన వద్దని లోకేష్ స్పష్టం చేశారు.