ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశారు. విరాట్ కోహ్లీ 54 బంతుల్లో 4 ఫోర్లతో 50 పరుగులు చేశారు. మరొక ఎండ్‌లో 43 పరుగులతో శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. దీంతో 25 ఓవర్లకు భారత్ స్కోర్ 131/2 గా ఉంది. రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత వీరిద్దరూ మంచి భాగస్వామ్యాన్ని కనబరిచారు.